బిగ్‌ డిస్‌ప్లే, బడ్జెట్‌ ధరలో పానాసోనిక్‌ కొత్త ఫోన్‌  | Panasonic India Launches Smartphone With Big Display | Sakshi
Sakshi News home page

బిగ్‌ డిస్‌ప్లే, బడ్జెట్‌ ధరలో పానాసోనిక్‌ కొత్త ఫోన్‌ 

Apr 17 2018 6:48 PM | Updated on Apr 17 2018 6:48 PM

Panasonic India Launches Smartphone With Big Display - Sakshi

తాజాగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఫుల్ స్క్రీన్ మొబైల్ ఫోన్ల హవా బాగా నడుస్తోంది. కంపెనీలూ కూడా ఈ డిస్‌ప్లే ఫోన్లపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. పానాసోనిక్ కంపెనీ కూడా బడ్జెట్ ధరలోనే 18:9 రేషియోతో ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే ఫోన్ ‘పి101’ ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 6,999 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ఆఫ్‌లైన్‌ రిటైలర్‌ సంగీత మొబైల్స్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. బడ్జెట్‌ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను పానాసోనిక్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ కొనుగోలు చేసిన తన కస్టమర్లకు ఐడియా సెల్యులార్‌ 60జీబీ డేటాను అందిస్తోంది. రూ.199 రీఛార్జ్‌పై 28 రోజుల పాటు అందనంగా 10జీబీ డేటా చొప్పున ఆరు సార్లు ఆఫర్‌ చేయనుంది. అదనంగా ఐడియా యూజర్లకు రూ.2000 క్యాష్‌బ్యాక్‌ కూడా లభిస్తోంది. 

పానాసోనిక్‌ పీ101 స్పెషిషికేషన్లు
5.45 అంగుళాల బిగ్‌ వ్యూ ఐపీఎస్‌ డిస్‌ప్లే విత్‌ 2.5 కర్వ్‌డ్‌ స్క్రీన్‌ 
డ్యూయల్‌ సిమ్‌
ఆండ్రాయిడ్‌ 7.1 నోగట్‌
1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ 6737 ప్రాసెసర్
2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత స్టోరేజీ
128 జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజీ పెంపు
వెనుకవైపు 8 మెగాపిక్సల్ ఆటోఫోకస్ కెమెరా ఫ్లాష్
ముందువైపు 5 మెగా పిక్సల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ 
4జీ వోల్టేకు సపోర్ట్
2,500 ఎంఏహెచ్ బ్యాటరీ
బరువు 145 గ్రాములు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement