ఒప్పో తొలి ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ | Oppo Planning to Set up its First Indian R&D centre in Hyderabad | Sakshi
Sakshi News home page

ఒప్పో తొలి ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌

Oct 1 2018 2:36 PM | Updated on Oct 1 2018 3:54 PM

Oppo Planning to Set up its First Indian R&D centre in Hyderabad - Sakshi

ఫైల్‌ ఫోటో​

సాక్షి, హైదరాబాద్‌: చైనీస్‌ మొబైల్‌ తయారీదారు ఒప్పో కూడా  హైదరాబాద్‌లో  పాగా వేయనుంది. త్వరలో తన మొదటి భారతీయ  మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ప్రారభించనుంది. సెల్ఫీ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల  సరికొత్త  ట్రెండ్‌కు తెరతీసిన ఒప్పోతన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్‌ డి) కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. అలాగే కంపెనీ ఆర్‌ అండ్‌ డీ హెడ్‌గా తస్లీమ్‌ ఆరిఫ్‌ను నియమించినట్టు  ఒక ప్రకటనలో తెలిపింది.

నూతన ఆవిష్కరణలు, సాంకేతిక సామర్ధ్యాలతో భారత వినియోగదారులకు ప్రత్యేకమైన అనుభవాలను అందించే దిశగా దృష్టి కేంద్రీకరిస్తున్నామనీ, ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరంలో మొదటి ఆర్‌ అండ్‌ డీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని ఒప్పో ఇండియా ప్రెసిడెంట్ చార్లెస్ వాంగ్ ఇండియా  తెలిపారు. మొబైల్ సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్‌ దాదాపు 15 ఏళ్ల అనుభవం ఉన్న ఆరిఫ్‌ నైపుణ్యంతో ఒక బలమైన టీంను  నిర్మించనున్నామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  అంతేకాదు చైనా తర్వాత  హైదరాబాద్‌ కేంద్రం రెండో అతిపెద్ద స్థానంగా  ఉంటుందనే ధీమాను  వ్యక్తం చేశారు.

కాగా ఒప్పో కంటే ముందు శాంసంగ్ మేక్ ఇండియా ఇన్నోవేషన్స్ (ఆర్‌ అండ్‌ డీ) ఆరిఫ్‌ పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా జపాన్‌, చైనా,అమెరికా సహా  ఇతర దేశాల్లో దాదాపు ఆరు కేంద్రాలున్నాయి.  త్వరలోనే ఏడవ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ హైదరాబాద్‌లో నగరంలో  కొలువు దీరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement