వన్‌ప్లస్ జెడ్ కమింగ్ సూన్ | OnePlus Z Price in India  Said to Launch on July 10 | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్ జెడ్ కమింగ్ సూన్

Jun 9 2020 10:36 AM | Updated on Jun 9 2020 10:51 AM

OnePlus Z Price in India  Said to Launch on July 10 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ మరో  స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది.  వన్‌ప్లస్ జెడ్ పేరుతో మిడ్ రేంజ్  స్మార్ట్ ఫోన్ ను జూలై 10 న భారతదేశంలో  ప్రవేశపెట్టనుంది.  ట్రిపుల్ రియర్ కెమెరాలతో రానున్న వన్‌ప్లస్ జెడ్ ధర రూ .24,990 గా ఉంటుందని అంచనా.  6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో పాటు,  12 జీబీ ర్యామ్‌ హై ఎండ్ వేరియంట్ ను తీసుకురానుందని ఇటీవల పలు నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే.  (బడ్జెట్ ధరల్లో వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు!)

వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో మాదిరిగానే వన్‌ప్లస్ జెడ్ లో కూడా ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను జోడించినట్టు సమాచారం. ఈ ఊహాగానాలకు సంస్థ అధికారిక  ప్రకటనతో మాత్రమే తెరపడనుంది. వన్‌ప్లస్ జెడ్ ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.  (వన్‌ప్లస్ 8 ఫ్లాష్ సేల్ : ఆఫర్లు)

వన్‌ప్లస్ జెడ్ ఫీచర్లు
6.40 అంగుళాల డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 10
64+16 (అల్ట్రా-వైడ్) 2  డెప్త్ సెన్సార్ రియర్ కెమెరా
16 ఎంపీ సెల్పీ కెమెరా
4300 ఎంఏహెచ్ బ్యాటరీ 
 

Advertisement
 
Advertisement
Advertisement