అద్భుత ఫీచర్లతో వన్‌ ప్లస్‌ 7టీ ప్రొ..త్వరలోనే | OnePlus 7T Pro launch for October 10 | Sakshi
Sakshi News home page

అద్భుత ఫీచర్లతో వన్‌ ప్లస్‌ 7టీ ప్రొ..త్వరలోనే

Oct 5 2019 4:26 PM | Updated on Oct 5 2019 4:31 PM

 OnePlus 7T Pro launch for October 10 - Sakshi

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్ ప్లస్  దూకుడు పెంచింది. తాజాగా వన్‌ప్లస్‌ 7 సిరీస్‌లో వచ్చిన వన్ ప్లస్ 7టీకి కొనసాగింపుగా ‘వన్ ప్లస్ 7టీ ప్రొ’ పేరుతో మరో కొత్త ఫోన్‌ను తీసుకురానుంది. ఈనెల 10న లండన్‌ లో నిర్వహించే ఈ వెంట్‌లోలాంచ్‌ చేయనుంది. భారతదేశంలో కూడా అదే రోజు ఆవిష్కరించనుందని అంచనా.అమెజాన్‌లో  ప్రత్యేకంగా  అందుబాటులోకి రానుంది. ఇక ఫీచర్ల విషయానికి స్తే వన్ ప్లస్ 7టీ మాదిరిగానే వన్ ప్లస్ 7టీ ప్రో  ఫీచర్లు  ఉండనున్నాయట.  ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంతో రానున్న మొదటి ఫోన్‌ ఇదే.

వన్‌ ప్లస్‌ 7టీ ప్రొ ఫీచర్లు 
6.65 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్
1440 x 3120 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌ 
48+8+16 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
16ఎంపీ  సెల్పీ కెమెరా
4085 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ప్రారంభ ధర సుమారు రూ.49,999

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement