సూపర్‌ ఫీచర్స్‌తో నుబియా స్మార్ట్‌ఫోన్‌ | Nubia N3 Will Launch in China | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఫీచర్స్‌తో నుబియా స్మార్ట్‌ఫోన్‌

Mar 12 2018 6:53 PM | Updated on Mar 12 2018 6:53 PM

Nubia N3 Will Launch in China - Sakshi

బీజింగ్‌ : స్మార్ట్‌ ప్రపంచంలోకి సరికొత్త ఫోన్‌ రాబోతుంది. జీటీఈ అనుబంధ సంస్థ నుబియా, నుబియా ఎన్‌3 పేరుతో అదిరిపోయే ఫీచర్స్‌తో స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి తేనుంది. ఈ కంపెనీ నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో ఫోన్‌ రిలీజ్‌ కాబోతుందని పుకార్లు షికార్లు చేశాయి. వాటిని నిజం చేస్తూ.. కంపెనీ నుబియా ఎన్‌3ని ఈ నెల 24న చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది. భారీ బ్యాటరీ,  బిగ్‌ స్క్రీన్‌ దీని ప్రత్యేకతలుగా కంపెనీ  చెబుతోంది. మొత్తం మూడు రంగుల్లో ఫోన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే ఫోన్‌ ధరను కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. ఆండ్రాయిడ్‌ ఓరియో అప్‌డేట్‌తో ప్రపంచ మార్కెట్లను  అలరించనుందనే అంచనా ఉన‍్నప్పటికీ.. ఎప్పటి వరకు అందుబాటులోకి  వస్తుందనేది  ప్రస్తుతానికి సస్పెన్సే. 

నుబియా ఎన్‌3 ఫీచర్స్‌
18:9 ఐపీఎస్‌ ఎల్‌సీడీ  
5.99 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ నౌగాట్‌ 7.1
4 జీబీ ర్యామ్‌
64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
128జీబీ వరకు విస్తరించుకోవచ్చు
16 ఎంపీ సెల్ఫీ కెమెరా  
ఆటో ఫోకస్‌తో వెనుక రెండు కెమెరాలు 
5000 యంఏహెచ్‌ బ్యాటరీ
ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌ సిస్టమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement