ఐపోన్ ల‌వ‌ర్స్‌కు శుభ‌వార్త‌, అమెజాన్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫ‌ర్లు!!

Amazon Selling Smartphone At Rs11000 Discount On Iphone 13 - Sakshi

యాపిల్ ఐపోన్ ల‌వ‌ర్స్‌కు శుభ‌వార్త‌. అమెజాన్ యాపిల్ ఐఫోన్ 13 కొనుగోలు దారుల‌కు భారీ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్13 గరిష్ట రిటైల్ ధర రూ.79,900నుండి తగ్గించి రూ.74,900కు విక్రయిస్తోంది. అయితే వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌పై రూ.11,000 వరకు డిస్కౌంట్‌తో పాటు ఇత‌ర ఆఫ‌ర్‌ల‌ను పొంద‌వ‌చ్చు.  
 
కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తో ఐఫోన్ 13ను సొంతం చేసుకోవాల‌నుకుంటే క్యాష్‌బ్యాక్ రూపంలో రూ.6000 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఐఫోన్ ధ‌ర రూ.68,900 ఉండ‌నుంది. ఐఫోన్13 256జీబీ వేరియంట్‌ను రూ.78,900 తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి కస్టమర్‌లు క్రెడిట్ కార్డ్‌ డిస్కౌంట్‌లను ఉపయోగించవచ్చు. 512జీబీ వేరియంట్‌ను రూ. 98,900 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ ప్రకారం వినియోగదారులు ఐఫోన్13 కొనుగోలు చేసిన 90రోజులలోపు వారి క్రెడిట్ కార్డ్‌లకు లేదా బ్యాంక్ అకౌంట్‌ల‌లో రూ.6వేలు జ‌మ అవుతాయి. అంతే కాకుండా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై అదనపు తగ్గింపు పొందడానికి కస్టమర్‌లు ఎక్ఛేంజ్ ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. అమెజాన్‌లో ఎక్ఛేంజ్ ఆఫ‌ర్ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ వేరియంట్‌లతో సహా అన్ని మోడల్స్ కు వ‌ర్తిస్తుంద‌ని అమెజాన్ తెలిపింది.  

కస్టమర్‌లు తమ పాత స్మార్ట్‌ఫోన్ పై రూ.15,350 వరకు ఎక్ఛేంజ్ ఆఫ‌ర్‌ పొందవచ్చు. ఎక్ఛేంజ్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో, ఆపిల్ ఐఫోన్ 13 కూడా రూ.5000 తగ్గింపుతో రూ.74,900కి విక్రయిస్తోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలో ఇ-కామర్స్ కంపెనీ ఐఫోన్ 13 కొనుగోలుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందడానికి కస్టమర్‌లు యాక్సిస్ ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top