ఆన్‌లైన్‌లో రిలయన్స్ సిమెంట్ | Now, buy cement online through Reliance Cement | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో రిలయన్స్ సిమెంట్

Oct 27 2015 1:54 AM | Updated on Sep 3 2017 11:31 AM

ఆన్‌లైన్‌లో రిలయన్స్ సిమెంట్

ఆన్‌లైన్‌లో రిలయన్స్ సిమెంట్

సిమెంట్ ఆన్‌లైన్ అమ్మకాలను రిలయన్స్ సిమెంట్ కంపెనీ (ఆర్‌సీసీ) ప్రారంభించింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రాకు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న

లక్నో: సిమెంట్ ఆన్‌లైన్ అమ్మకాలను రిలయన్స్ సిమెంట్ కంపెనీ (ఆర్‌సీసీ) ప్రారంభించింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రాకు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ మూడు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ అమ్మకాలను ప్రారంభించిందని ఒక ప్రతినిధి తెలియజేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే ఈ-టైలింగ్ సౌలభ్యం తదుపరి దశల్లో విస్తరిస్తామని ఆయన తెలిపారు. కనీసం 25 బ్యాగులు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 48 గంటల్లో లోడ్ డెలివరీ అవుతుంది. సంస్థకు  ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కర్మాగారాలు ఉన్నాయి. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.5 మిలియన్ టన్నులు.

Advertisement
 
Advertisement
Advertisement