ఆ రెండు నోకియా ఫోన్ల ప్రీ-ఆర్డర్లు ప్రారంభం

Nokia 7 Plus, Nokia 8 Sirocco Pre Orders Now Open in India - Sakshi

హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఇటీవల లాంచ్‌ చేసిన నోకియా 7 ప్లస్‌, నోకియా 8 సిరోకో స్మార్ట్‌ఫోన్ల ప్రీ-ఆర్డర్లు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. భారత్‌లో ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లను ప్రారంభించినట్టు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటించింది. మార్చిలో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు గ్లోబల్‌గా అందుబాటులోకి రాగ, ఈ నెల మొదట్లో భారత్‌లో లాంచ్‌ అయ్యాయి. ఏప్రిల్‌ 30 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లు వినియోగదారుల చేతిలోకి రానున్నాయి. నోకియా 7 ప్లస్‌ ధర రూ.25,999గా కంపెనీ నిర్ణయించగా.. అమెజాన్‌ ఇండియా, నోకియా.కామ్‌/ఫోన్లలో ఇది అందుబాటులో ఉండనుంది. నోకియా సిరోకో ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌, నోకియా మొబైల్‌ షాపులో లభ్యం కానుంది. 

సంగీత, పూర్విక, బిగ్‌ సి, క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌ వంటి ఎంపిక చేసిన అవుట్‌లెట్లలో కూడా ఈ రెండు హ్యాండ్‌సెట్లు దొరకనున్నాయి. నోకియా 7 ప్లస్‌ కొనుగోలుదారులకు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ రూ.2000 క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. అదేవిధంగా నోకియా 8 సిరోకో స్మార్ట్‌ఫోన్‌ఫై ఎయిర్‌టెల్‌ తన యూజర్లకు 20జీబీ అదనపు డేటాను ఆఫర్‌ చేయనుంది. పోస్టుపెయిడ్‌ కస్టమర్లు రూ.399, రూ.499 ప్లాన్లపై నెలకు 20జీబీ కాంప్లిమెంటరీ డేటా పొందనున్నారు.  2018 డిసెంబర్‌ 31 వరకు ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను అందించనుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందనున్నారు. మేక్‌మైట్రిప్‌ ద్వారా జరిపే దేశీయ హోటల్స్‌ బుకింగ్స్‌పై 25 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభించనుంది.

నోకియా 7 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 660 ఎస్‌ఓసీ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ వీ5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా 8 సిరోకో ఫీచర్లు
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 3డీ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారోమీటర్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top