బిగ్‌–సి ఔట్‌లెట్స్‌లో నోకియా–5 ప్రీబుకింగ్‌ | Nokia 5 India Pre-Bookings Begin Today | Sakshi
Sakshi News home page

బిగ్‌–సి ఔట్‌లెట్స్‌లో నోకియా–5 ప్రీబుకింగ్‌

Aug 12 2017 3:17 AM | Updated on Sep 17 2017 5:25 PM

బిగ్‌–సి ఔట్‌లెట్స్‌లో నోకియా–5 ప్రీబుకింగ్‌

బిగ్‌–సి ఔట్‌లెట్స్‌లో నోకియా–5 ప్రీబుకింగ్‌

మొబైల్స్‌ రంగంలో ఉన్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా–5 ప్రీ–బుకింగ్స్‌ను బిగ్‌–సి ఔట్‌లెట్స్‌లో శుక్రవారం ప్రారంభించింది.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ రంగంలో ఉన్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా–5 ప్రీ–బుకింగ్స్‌ను బిగ్‌–సి ఔట్‌లెట్స్‌లో శుక్రవారం ప్రారంభించింది. గొరిల్లా గ్లాస్‌తో 5.2 అంగుళాల ఐపీఎస్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆన్‌డ్రాయిడ్‌ 7.1.1 ఓఎస్, 4జీ, డ్యూయల్‌ సిమ్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 128 జీబీ ఎక్స్‌పాండెడ్‌ మెమరీ, డ్యూయల్‌ టోన్‌ ఫ్లాష్‌తో 13 ఎంపీ ఫేస్‌ డిటెక్షన్‌ ఆటోఫోకస్‌ కెమెరా, ఆటోఫోకస్‌తో 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఈ స్మార్ట్‌ఫోన్‌కు పొందుపరిచారు. 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

ధర రూ.12,899. నోకియా–5 కొనుగోలుపై ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌ ఉచితంగా ఆఫర్‌ చేస్తున్నట్టు బిగ్‌–సి మొబైల్స్‌ చైర్మన్‌ ఎం.బాలు చౌదరి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఆగస్టు 15 నుంచి విక్రయాలు ఆరంభమవుతాయని హెచ్‌ఎండీ గ్లోబల్‌ సౌత్, వెస్ట్‌ జీఎం టీఎస్‌ శ్రీధర్‌ వెల్లడించారు. భారత మొబైల్‌ మార్కెట్లో 2008–11 మధ్య నోకియా నంబర్‌ వన్‌ బ్రాండ్‌గా కొనసాగిందని గుర్తు చేశారు. ఇటీవల విడుదలైన 3310, నోకియా–3 మోడళ్లు హాట్‌కేక్‌లా అమ్ముడయ్యాయని అన్నారు. వీటి విక్రయాలనుబట్టి చూస్తే నోకియా బ్రాండ్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. నోకియా–6 అమ్మకాలు ఆగస్టు 23 నుంచి మొదలవుతాయని, ఇప్పటికే 10 లక్షల పైచిలుకు బుకింగ్స్‌ నమోదయ్యాయని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement