నిస్సాన్ డాట్సన్ రెడి-గో వచ్చేసింది

నిస్సాన్ డాట్సన్ రెడి-గో వచ్చేసింది


ధర రూ.2.38-3.34 లక్షల రేంజ్‌లో

25.17 కి.మీ. మైలేజీ


 న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్‌లో కొత్త చిన్న కారు మోడల్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. డాట్సన్ రెడి-గో పేరుతో అందిస్తున్న ఈ పెట్రోల్ కారు ధరలు 2.38 లక్షల నుంచి రూ.3.34 లక్షల రేంజ్‌లో నిర్ణయించామని నిస్సాన్ ఇండియా కంపెనీ తెలిపింది. డాట్సన్ రెడి గో కారును ఐదు వేరియంట్లు-డి, ఏ, టీ, టి(ఓ), ఎస్‌ల్లో అందిస్తున్నామని నిస్సాన్ ఇండియా ఎండీ, అరుణ్ మల్హోత్ర చెప్పారు. చిన్న కారు అంటే భారత్‌లో ఉన్న అంచనాలను ఈ డాట్సన్ గో మార్చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం నుంచే విక్రయాలు ప్రారంభించామని తెలిపారు.


 ధరల పోరు షురూ!

రెడీ గో రాకతో ఎంట్రీ-లెవల్ సెగ్మంట్‌లో ధరల యుద్ధానికి తెర లేవనున్నదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ కారు మారుతీ ఆల్టో,  హ్యుందాయ్ ఈఆన్, రెనో క్విడ్ కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులంటున్నారు. ఈ కార్ల ధరలు రూ.2.5 లక్షల నుంచి రూ4.42 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.


 మూడో డాట్సన్ కారు: డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ అందిస్తోన్న మూడో కారు ఇది. భారత్‌లో అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫాం మీద ఈ కారును నిస్సాన్‌కంపెనీ తయారు చేస్తోంది. 800 సీసీ ఇంజిన్, ఐదు గేర్లు ఉన్న ఈ కారు 25.17 కి.మీ. మైలేజీని ఇస్తుందని,  వంద కిమీ, వేగాన్ని 15.9 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని అరుణ్  పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top