నిఫ్టీకి తదుపరి నిరోధం 10750

nifty next resistance 10750 - Sakshi

బ్యాంక్‌ నిఫ్టీ తక్షణ నిరోధం 22400

ఆనంద్‌ రాఠి సాంకేతిక నిపుణడు నీలేశ్‌ రమేశ్‌ జైన్‌

మార్కెట్‌ ర్యాలీ కొనసాగితే నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో 10750 స్థాయిని అందుకొనే అవకాశం ఉందని ఆనంద్‌ రాఠి టెక్నికల్‌ విశ్లేషకుడు నీలేశ్‌ రమేశ్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. అలాగే ఇదే స్థాయి నిఫ్టీకి తదుపరి నిరోధ స్థాయి కావచ్చని, ఈ స్థాయి నిఫ్టీ 100రోజుల ఎక్స్‌పోన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ స్థాయిగా ఉందని నీలేశ్‌ తెలిపారు. వీక్లీ ఛార్ట్‌లో నిఫ్టీ పెద్ద బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. నిఫ్టీకి కీలకమైన 61.8శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి 10,550పై ఈ వారాన్ని ముగించిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 

వీక్లీ ఛార్ట్‌లో మూమెంటం ఇండికేటర్లు, ఓసిలేటర్లు బయింగ్‌ మోడ్‌లో ఉన్నాయని, ఇది మార్కెట్‌పై బుల్స్‌ పట్టు సాధించడాన్ని  సూచిస్తుందని నీలేశ్‌ తెలిపారు. ప్రస్తుత పుల్‌బ్యాక్‌ ర్యాలీ మరింత విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. ఒలటాలిటీ ఇండెక్స్‌ ఇండియా వీఐఎక్స్‌ 10శాతం నష్టపోయి 3నెలల కనిష్టస్థాయి 25.7 స్థాయి వద్ద ముగిసింది. వీఐఎక్స్‌ పతనం మార్కెట్లో స్వల్పకాలంలో పాటు ఎలాంటి ఒడిదుడుకులు ఉండకపోవచ్చని సూచిస్తుంది. ఇది బుల్స్‌కు మరింత ఉత్సాహానిచ్చే అంశంగా ఉందని నీలేశ్‌ పేర్కోన్నారు.

నిఫ్టీ ఇండెక్స్‌తో పోలిస్తే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ చాలా తక్కువగా ర్యాలీ చేసింది. ఈ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ వీక్లీ స్కేల్‌లో చిన్న బుల్లిష్‌ క్యాండిల్‌ నమోదైంది. అప్‌సైడ్‌లో 22,400 స్థాయి కీలక నిరోధంగా మారునుంది. ఈ స్థాయిని అధిగమించగలిగితే నిఫ్టీ తక్షణ నిరోధం 23,500 స్థాయి వద్ద ఉందని నీలేశ్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top