breaking news
resistant
-
నిఫ్టీకి తదుపరి నిరోధం 10750
మార్కెట్ ర్యాలీ కొనసాగితే నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో 10750 స్థాయిని అందుకొనే అవకాశం ఉందని ఆనంద్ రాఠి టెక్నికల్ విశ్లేషకుడు నీలేశ్ రమేశ్ జైన్ అభిప్రాయపడ్డారు. అలాగే ఇదే స్థాయి నిఫ్టీకి తదుపరి నిరోధ స్థాయి కావచ్చని, ఈ స్థాయి నిఫ్టీ 100రోజుల ఎక్స్‌పోన్షియల్ మూవింగ్ యావరేజ్ స్థాయిగా ఉందని నీలేశ్ తెలిపారు. వీక్లీ ఛార్ట్‌లో నిఫ్టీ పెద్ద బుల్లిష్ క్యాండిల్‌ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. నిఫ్టీకి కీలకమైన 61.8శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి 10,550పై ఈ వారాన్ని ముగించిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. వీక్లీ ఛార్ట్‌లో మూమెంటం ఇండికేటర్లు, ఓసిలేటర్లు బయింగ్ మోడ్‌లో ఉన్నాయని, ఇది మార్కెట్‌పై బుల్స్ పట్టు సాధించడాన్ని సూచిస్తుందని నీలేశ్ తెలిపారు. ప్రస్తుత పుల్‌బ్యాక్ ర్యాలీ మరింత విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. ఒలటాలిటీ ఇండెక్స్ ఇండియా వీఐఎక్స్ 10శాతం నష్టపోయి 3నెలల కనిష్టస్థాయి 25.7 స్థాయి వద్ద ముగిసింది. వీఐఎక్స్ పతనం మార్కెట్లో స్వల్పకాలంలో పాటు ఎలాంటి ఒడిదుడుకులు ఉండకపోవచ్చని సూచిస్తుంది. ఇది బుల్స్‌కు మరింత ఉత్సాహానిచ్చే అంశంగా ఉందని నీలేశ్ పేర్కోన్నారు. నిఫ్టీ ఇండెక్స్‌తో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చాలా తక్కువగా ర్యాలీ చేసింది. ఈ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ వీక్లీ స్కేల్లో చిన్న బుల్లిష్ క్యాండిల్ నమోదైంది. అప్‌సైడ్‌లో 22,400 స్థాయి కీలక నిరోధంగా మారునుంది. ఈ స్థాయిని అధిగమించగలిగితే నిఫ్టీ తక్షణ నిరోధం 23,500 స్థాయి వద్ద ఉందని నీలేశ్ తెలిపారు. -
ప్రకృతి విపత్తులను తట్టుకునేట్టుగా...
జర్మనీః కొబ్బరి చెట్టు' వ్యాసం ప్రతి విద్యార్థీ చిన్న తరగతుల్లో చదువుకునే ఉంటాడు. కొబ్బరిచెట్టు ఆకులు, కాండం నుంచీ కాయలదాకా ప్రతి భాగం మనిషి జీవితంలో ఎంతో ఉపయోగ పడుతుందని ఆ వ్యాసం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఎందరికో అనుభవపూర్వకం కూడా. అందుకే కాబోలు జర్మనీ శాస్త్రవేత్తల దృష్టి కొబ్బరి పై పడింది. నాగరికతద్వారా మనుషులు భూమిపై వారి ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నా... ప్రకృతి సహజ విపత్తులు, అంటువ్యాధులు వంటివి ఇంకా జీవితాలపై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి విపత్తుల పరిష్కారం దిశగా ఆలోచించిన జర్మన్ శాస్త్రవేత్తలు కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. భూకంపాలను నిరోధించేందుకు కొబ్బరి కాయలో అత్యంత ధృఢంగా ఉండే పెంకులపై దృష్టి సారించారు. జర్మన్ రీసెర్చ్ ఫౌండేషన్ విపత్తులను ఎదుర్కొనేందుకు కొత్త మార్గంలో ప్రయోగాలు చేస్తోంది. తమ ప్రణాళికలను అభివృద్ధి పరిచేందుకు పరిశోధకులు ప్రయత్నాలు ప్రారంభించారు. సహజ విపత్తులను తట్టుకోగలిగే శక్తి కొబ్బరి పెంకులో ఉన్నట్లు గుర్తించారు. అందులోని పదార్థాల ఆధారంగా భూ కంపాలు ఇతర ప్రకృతి విలయాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా 30 మీటర్ల ఎత్తు ఉండే కొబ్బరి చెట్లనుంచీ కాయలు కింద పడినా పగిలిపోకుండా కాపాడే కొబ్బరి పెంకు ధృఢత్వాన్ని గుర్తించిన పరిశోధకులు... దాని ఆధారంగా విపత్తు నివారణా మార్గాలపై అధ్యయనం చేశారు. కొబ్బరి పెంకు నిర్మాణానికి సంబంధించిన ఫార్ములాపై ప్రయోగాలు చేస్తున్నారు. కొబ్బరి పెంకులో ఉండే లెథరీ ఎక్సో కార్ప్, ఫైబరస్ మెకోకార్స్, ఎండోకార్ప్ అనే మూడు పొరల వల్ల కొబ్బరి పెంకు ధృఢంగా ఉంటుందన్న విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు అదే స్ఫూర్తిగా ఇళ్ళ నిర్మాణం చేపడితే విపత్తులను, భూకంపాలను తట్టుగోగల్గుతాయన్న దిశగా ఆలోచిస్తున్నారు. బయోలాజికల్ డిజైన్ అండ్ ఇంటిగ్రేటివ్ స్ట్రక్చర్స్ ప్రాజెక్టు ద్వారా.. జర్మనీలోని ఫ్రీబర్గ్ యూనివర్శిటీ ప్లాంట్ బయో మెకానిక్స్ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు, మెటీరియల్ సైంటిస్టు ల బృందం సంయుక్తంగా భూకంపాలను తట్టుకునే నిర్మాణాలను చేపట్టే దిశగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యంత్రాలను వినియోగించి కొబ్బరి పెంకులోని మూడు పొరల్లో ఉండే శక్తిని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎండోకార్ప్ పొర కారణంగా కొబ్బరి పెంకు ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగలదని, పగుళ్ళు లోపలకు పోనీకుండా అందులోని లిగ్నిఫైడ్ స్టోన్ సెల్స్ ప్రభావం చూపిస్తాయని గుర్తించారు. తమ ప్రయోగాలు ఫలిస్తే.. భవిష్యత్తులో భూకంపాలు వచ్చినా తట్టుకోగలిగే ఇళ్ళ నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని చెప్తున్నారు.