ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా విశ్వనాథన్‌

 N S Vishwanathan re-appointed deputy governor of RBI for one year - Sakshi

సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ను  కొనసాగిస్తూ  కేంద్రం నిర్ణయం తీసుకుంది.  జూలై 3వ తేదీతో విశ్వనాథన్‌ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన్ను మరోసారి ఎంపిక చేసింది. జూలై 4 నుంచి మరో ఏడాది కాలానికి విశ్వనాథన్‌ను తిరిగి డిప్యూటీ గవర్నర్‌గా నియమించడానికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రిత్వ శాఖ సోమవారం  ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది.  

కాగా ఆర్‌బీఐ ముగ్గరు డిప్యూటీ గవర్నర్లలో విశ్వనాథన్‌ ఒకరు. కాగా  గత నెలలో డిప్యూటీ గవర్నర్‌ విరేల్‌ ఆచార్య వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top