అంబానీ ఇంట వివాహం : స్టాలిన్‌కు ఆహ్వానం

Mukesh Ambani Invite MK Stalin To Son Akash Wedding - Sakshi

సాక్షి, చెన్నై : ఆసియా కుబేరుడు, రిలయన్స్ చైర్‌పర్సన్ ముఖేష్‌ అంబానీ ఇంట మరోసారి పెళ్లి బాజా మోగనుంది. అంబానీల ఆడపడుచు ఇషా అంబానీ వివాహం గతేడాది డిసెంబరులో పిరమిల్‌ గ్రూపు వారసుడు ఆనంద్‌ పిరమాల్‌తో జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా మూడు నెలలకు తర్వాత.. వచ్చేనెల( మార్చి) 9న ముఖేష్‌-నీతా అంబానీల తనయుడు ఆకాశ్ అంబానీ వివాహం జరగనుంది. వజ్రాల వ్యాపారి రస్సెల్‌​ మెహతా కుమార్తె శ్లోకా మెహతా, అంబానీ ఇంటి కోడలుగా వెళ్లనుంది. మార్చి 9నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వివాహ వేడుక పనులు చకచక జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో ఈ వివాహానికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ముఖేష్‌ దంపతులు అతిథులను ఆహ్వానించడంలో బిజీగా ఉన్నారు. (అంబానీ ఇంటి వివాహం : మొదటి ఆహ్వానం ఆయనకే!)

సోమవారం సాయంత్రం తొలి శుభలేఖను ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో అందించిన ముఖేష్‌ దంపతులు.. అదే రోజు చెన్నై వెళ్లి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆయన భార్య దుర్గా స్టాలిన్‌ను కలిసి కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. ఈ విషయాన్ని స్టాలిన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ముఖేశ్ దంపతుల నుంచి ఆహ్వానం అందడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ వారితో ఉన్న కొన్ని ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top