మోటరోలా నుంచి ‘మోటో జీ4’ స్మార్ట్ ఫోన్స్ | Motorola just announced three new Moto Gs | Sakshi
Sakshi News home page

మోటరోలా నుంచి ‘మోటో జీ4’ స్మార్ట్ ఫోన్స్

May 18 2016 1:26 AM | Updated on Sep 4 2017 12:18 AM

మోటరోలా నుంచి ‘మోటో జీ4’ స్మార్ట్ ఫోన్స్

మోటరోలా నుంచి ‘మోటో జీ4’ స్మార్ట్ ఫోన్స్

మోటరోలా కంపెనీ తాజాగా తన ‘మోటో జీ’ సిరీస్‌లోనే ‘మోటో జీ4’, ‘మోటో జీ4 ప్లస్’ అనే రెండు 4వ జనరేషన్ స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది..

న్యూఢిల్లీ: మోటరోలా కంపెనీ తాజాగా తన ‘మోటో జీ’ సిరీస్‌లోనే ‘మోటో జీ4’, ‘మోటో జీ4 ప్లస్’ అనే రెండు 4వ జనరేషన్ స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.13,499గా ఉంది. అలాగే ‘మోటో జీ4 ప్లస్’ రెండు వెర్షన్లలో లభ్యంకానున్నది. వీటిల్లో 5.5 అంగుళాల తెర, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 2జీ/3జీ ర్యామ్, 1.5 గిగాహెర్జ్ట్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ‘మోటో జీ4’, ‘మోటో జీ4 ప్లస్’ అనే రెండు వేరియంట్ల మధ్య ఉన్న ప్రధాన తేడా.. ‘మోటో జీ4 ప్లస్’లో ఫింగర్‌ప్రింట్ స్కానర్, 16 ఎంపీ రియర్ కెమెరా ఉంటే.. ‘మోటో జీ4’లో 13 ఎంపీ రియర్ కెమెరా ఉండి, స్కానర్ ఉండదు. ఈ ఫోన్లు కేవలం అమెజాన్‌లో మాత్రమే లభ్యంకానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement