ఆ కారు ధర భారీగా తగ్గింది.. | Mitsubishi Outlander Gets Massive Price Cut | Sakshi
Sakshi News home page

ఆ కారు ధర భారీగా తగ్గింది..

Dec 17 2019 4:40 PM | Updated on Dec 17 2019 4:41 PM

Mitsubishi Outlander Gets Massive Price Cut - Sakshi

భారత్‌లో అవుట్‌ల్యాండర్‌ 2019 ఎస్‌యూవీ ధరను మిట్సుబిషి భారీగా తగ్గించింది.

సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది లాంఛ్‌ అయిన మిట్సుబిషి అవుట్‌ల్యాండర్‌ ఎస్‌యూవీ ధర భారత్‌లో భారీగా తగ్గింది. అవుట్‌ల్యాండర్‌ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ రూ 31.95 లక్షలు కాగా ప్రస్తుతం భారత్‌లో ఇది రూ 26.93 లక్షలకే అందుబాటులో ఉంది. రూ 5 లక్షల వరకూ ధర తగ్గిన ఈ ఎస్‌యూవీ మరికొన్ని అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. న్యూ 7 ఇంచ్‌ టచ్‌స్ర్కీన్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి పలు ఫీచర్లను ఈ వెహికల్‌లో కంపెనీ జోడించింది. ఇక డ్యూయల్‌ జోన్‌ పూర్తి ఆటోమేటిక్‌ కంట్రోల్‌, కీలెస్‌ ఎంట్రీ, ఇంజన్‌ పుష్‌ బటన్‌ స్టార్ట్‌, ఆటో హోల్డ్‌ ఫంక్షన్‌తో ఎలక్ర్టిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, ఎలక్ర్టానిక్‌ పవర్‌స్టీరింగ్‌ వంటి ఇతర ఫీచర్లను న్యూ మోడల్‌లోనూ జోడించారు. ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే డ్రైవర్‌తో పాటు ప్రయాణీకులను కవర్‌ చేసేలా ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, యాక్టివ్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, సెక్యూరిటీ అలారం వ్యవస్థ, బ్రేక్‌ అసిస్ట్‌ సిస్టం వంటి పలు ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో పొందుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement