పేటీఎంతో మెట్రో టికెట్‌

Metro ticket with paytm - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పేటీఎం ద్వారా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ టికెట్‌ను కొనుగోలు చేసే వీలుంది. అంటే మెట్రో స్మార్ట్‌ కార్డ్‌ రీచార్జ్‌ చేసుకోవచ్చు. దీనికోసం హెచ్‌ఎంఆర్‌తో ఒప్పందం చేసుకున్నామని, పలు సాంకేతికాంశాల కారణంగా అధికారికంగా వెల్లడించలేదని పేటీఎం రీజినల్‌ హెడ్‌ టామ్‌ జాకబ్‌ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో చెప్పారు.

ఢిల్లీ మెట్రోతోనూ ఒప్పందం చేసుకున్నామని, ప్రస్తుతం అక్కడి మొత్తం టికెట్‌ విక్రయాల్లో 48 శాతం పేటీఎం ద్వారానే జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ డెవలప్‌మెంట్స్‌కు సంబంధించి గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల మంది పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ వర్తకులున్నారని.. ఇందులో 3.5 లక్షల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని, ఈ ఏడాది ముగిసేలోగా 10 లక్షల వ్యాపారులను లకి‡్ష్యంచామని ఆయన వివరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top