బంగారంలో ట్రేడింగ్ చేస్తున్నారా?

MCX ICEX Cut Trading Hours Over Corona Effect - Sakshi

ముంబై కోవిడ్ 19 వైరస్ మహమ్మారి విస్తరణ, దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో ఫ్యూచర్స్‌ మార్కెట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి.  మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఎక్స్‌), ఇండియన్‌ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌(ఐఈఎక్స్) ట్రేడింగ్ సమయాన్ని తగ్గిస్తూ ఎంసీఎక్స్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  సెబీ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం కమోడిటీ ట్రేడింగ్‌ కేవలం 8 గంటలే జరగనుంది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే జరగనుందని ఎంసీఎక్స్‌, ఐసీఈఎక్స్‌ సర్క్యులర్‌లో వెల్లడించాయి. ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 14 వరకు  ఈ నిర్ణయం అమల్లో వుంటుంది.

 తొలి 15 నిమిషాలు జీటీసీ/జీటీడీ చెల్లుబాటు ఆర్డర్స్‌ రద్దు కోసం ప్రి-ఓపెన్‌ సెషన్‌ నిర్వహిస్తారు. అలాగే చివరి 15 నిమిషాలు అంటే రాత్రి 11:30 నుంచి 11:45 వరకు క్లోజింగ్‌ సెషన్‌ నిర్వహిస్తారు. ఈ రెండు సెషన్లు కూడా ఉదయం 9 గంటల నుంచి 9:45 నిమిషాల వరకు, సాయంత్రం 4:45 నిమిషాల నుంచి 5గంటల వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2, ఏప్రిల్ 6,  ఏప్రిల్ 14, 2020 న సాయంత్రం సెషన్ (ట్రేడింగ్ సెషన్) అందుబాటులో ఉండదు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు కమోడిటీ ట్రేడింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

చదవండి : మార్కెట్లకు రుచించని ప్యాకేజీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top