మార్కెట్లకు రుచించని ప్యాకేజీ

 Sense Losses Over 1000 Points On Fm Press Brief - Sakshi

ముంబై : కరోనా వైరస్‌ వ్యాప్తితో ఇబ్బందులుపడుతున్న  పేదలు, అల్పాదాయ కుటుంబాలను  ఆదుకునే లక్ష్యంతో కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ మార్కెట్లను మెప్పించనట్టు కనిపిస్తోంది  ఎన్నో ఆశలతో ఎదురుచూసిన  ప్యాకేజీ మార్కట్  అంచనాలను అందుకోలేకపోవడంతో తాజాగా ఇన్వెస్లర్లలో నిరాశ నెలకొంది. దీంతో మార్కెట్లు అనూహ్యంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆరంభ లాభాలు కరిగిపోయాయి. మార్నింగ్‌ సెషన్‌లో భారీ లాభాల్లో కదలాడిన సూచీలు  అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. భారీ ప్యాకేజీ అంచనాలతో  ఒక దశలో 1600 పాయింట్లు ఎగిసిన ప్రస్తుతం సెన్సెక్స్‌ 800 పాయింట్లు లాభానికే పరిమితమైంది. అటు నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.   గరిష్టం నుంచి  దాదాపు వెయ్యి పాయింట్లు పతనమైంది.

సెన్సెక్స్ 30వేల స్థాయిని, నిఫ్టీ 8700  కీలక మద్దతు స్థాయిని కోల్పోవడం గమనార్హం .ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌  లాభాల్లో  ఉన్నాయి. వీటితోపాటు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 33.62శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 10.76 శాతం, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 8.03శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 7.69 శాతం, యూపీఎల్‌ 7.24శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. యెస్‌ బ్యాంక్‌ 6.08 శాతం, మారుతీ సుజుకీ 4.18 శాతం, అదానీ పోర్ట్స్‌ 4.03శాతం, గెయిల్‌ 3.71శాతం, ఎన్టీపీసీ 2.63శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.

చదవండి : లాక్‌డౌన్‌కు, కర్ఫ్యూకు తేడా ఏమిటీ?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top