రుపీ దెబ్బ: మారుతి ధరలు పెంచేసింది!

Maruti Suzuki India hikes prices of vehicles across models by up to Rs 6,100   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  మారుతి సుజుకి  ధరలను పెంపును ప్రకటించింది. దేశంలో అతిపెద్ద వాహన తయారుదారు తన మోడళ్లు అన్నింటి ధరలను పెంచుతున్నట్టు ఇటీవల ప్రకటించింది.  ఈ నేపథ్యంలో దేశీయంగా మారుతికి చెందిన అన్ని మోడళ్ల వాహనాల ధరలను గరిష్టంగా 6,100 రూపాయల (ఎక్స్‌ షోరూం ఢిల్లీ) వరకు ధరల పెంపు వుంటుందని గురువారం వెల్లడించింది. వస్తువుల ధరలు,  పంపిణీ ధరలు పెరగడంతోపాటు విదేశీ మారకంలో పడిపోతున్న రూపాయి విలువ కూడా తమ ధరలను  ప్రభావితం చేసిందని మారుతి సుజుకి ప్రతినిధి తెలిపారు.  ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

కాగా  బాగా పెరిగిన ఉత్పత్తి ఖర్చులు , తదితర వ్యయాల కారణంగా తమ వాహనాల ధరలను ఆగస్టు నుంచి పెంచుతున్నట్టు  మారుతి సహా, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, టాటా మోటార్స్‌లాంటి దిగ్గజ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top