
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ వాహన ధరలు పెంచనుంది. జనవరి నుంచి పలు మోడళ్లపై 2 శాతం వరకు ధరల్ని పెంచుతున్నట్లు తెలిపింది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల పెంపునకు ప్రధాన కారణమని పేర్కొంది. కాగా కంపెనీ ఆల్టో 800 నుంచి ఎస్–క్రాస్ వరకు పలు మోడళ్లను మార్కెట్‌లో విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.2.45 లక్షలు నుంచి రూ.11.29 లక్షల శ్రేణిలో ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి.