ఈ మారుతీ కారుపై లక్ష రూపాయల తగ్గింపు

Maruthi Suzuki Announces Bumper Offer For Baleno Model - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ కస్టమర్లకు శుక్రవారం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తన బాలెనో మోడల్‌ కారుపై లక్ష రూపాయలు తగ్గించి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఢిల్లీలో బాలెనో మోడల్‌ ధర 5,58,602 ఉంది. ఎంపిక చేసిన పది మోడల్స్‌పై రెండో రోజుల క్రితం 5000 రూపాయల వరకు తగ్గింపు ప్రకటించిన విషయం తెలిసిందే. పండుగ సీజన్‌కు ముందు ఇలాంటి ఆఫర్లతో అమ్మకాలు పెరుగుతాయని తద్వారా కొత్త  కస్టమర్లు పెరిగే అవకాశం ఉన్నట్లు మారుతి సుజుకి తెలిపింది.

ఇటీవల కాలంలో ఆర్థిక మాంద్యం ప్రభావంతో అన్ని కంపెనీల కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. పండుగ సీజన్‌ను క్యాష్‌ చేసుకునే ఉద్దేశంతో అన్ని కంపెనీలు కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మారుతీ సుజకీ బంపర్‌ ఆఫర్లు ప్రకటించడం విశేషం. సియామ్ గణాంకాల ప్రకారం ఆగస్టులో వాహనాల అమ్మకాలు 31.57 శాతం వరకు పడిపోయాయి. (చదవండి: మందగమనంపై సర్జికల్‌ స్ట్రైక్‌!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top