
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాల పరంపరను వరుసగా రెండో రోజుకూడాకొనసాగించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్లు ఆరంభం నుంచి లాభాలతో కళకళలాడాయి. ఒకదశలో 400 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ చివరకు 350 పాయింట్లు ఎగిసి 41566 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు ఎగిసి 12201 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 12200 స్థాయిని నిలబెట్టుకుంది. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకు రంగాలు బాగా లాభపడ్డాయి. హెచ్‌యూఎల్, కోటక్ మహీంద్ర, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంకు, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, ఎం అండ్ ఎం లాభపడగా, ఎస్‌బీఐ, ఇండస్ ఇండ్, సన్‌ఫార్మ, అల్ట్రాటెక్ సిమెంట్, టైటన్ ఎన్‌టీపీసీ నష్టపోయాయి.