ఫేస్‌బుక్‌ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం

Mark Zuckerberg Shares Video on Facebook Jio Deal - Sakshi

సాక్షి, న్యూడిల్లీ :  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌, దేశీయ ఇంధన దిగ్గజం రిలయన్స్ జియో ఒప్పందంపై ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్  స్పందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయనొక వీడియోను షేర్ చేశారు. డిజిటల్ ఇండియాగా మారుతున్న తరుణంలో తమ ఒప్పందం  దేశవ్యాప్తంగా ప్రజలకు వాణిజ్య అవకాశాలను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ డీల్ ప్రారంభం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఇందుకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి, మొత్తం జియో బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు తమ ఆధీనంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్, రిలయన్స్ ఆధీనంలోని ఇ-కామర్స్ వెంచర్ జియో మార్ట్ మధ్య సహకారాలపై దృష్టి సారిస్తామని చెప్పారు.  (రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడి

ఫేస్‌బుక్‌  జియో ప్లాట్‌ఫామ్‌లతో జతకట్టింది ఆర్థిక పెట్టుబడులు పెడుతున్నాం, అంతకన్నా ఎక్కువ, భారతదేశం అంతటా ప్రజలకు వాణిజ్య అవకాశాలను తెరిచే కొన్ని ప్రధాన ప్రాజెక్టులపై కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాని మిస్టర్ జుకర్‌బర్గ్ తన అధికారిక ఫేస్‌బుక్‌  పోస్ట్ లో రాశారు. ఫేస్ బుక్, వాట్సాప్ కు సంబంధించిన భారీ వినియోగదారులు,  చాలామంది ప్రతిభావంతులైన పారిశ్రామికవేత్తలకు భారతదేశం నిలయం.. దేశం ఒక పెద్ద డిజిటల్ పరివర్తన క్రమంలో ఉంది. ముఖ్యంగా  జియో వంటి సంస్థలు వందల మిలియన్ల భారతీయులను, చిన్న వ్యాపారాలను ఇందులో మిళితం చేయడంలో పెద్ద పాత్ర పోషించాయని జుకర్ బర్గ్ పేర్కొన్నారు.  చిన్న వ్యాపారాలు ప్రతి ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైనవి,  ఈ నేపథ్యంలో వాటికి మా మద్దతు అవసరం. దేశంలో 60 మిలియన్లకు పైగా చిన్న వ్యాపారాలున్నాయి.  మిలియన్ల మంది ప్రజలు ఉద్యోగాల కోసం చూస్తున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా లాక్‌డౌన్‌లో ఉన్న కారణంగా డిజిటల్ సాధనాల ప్రాముఖ్యత చాలా వుంది. చిన్న సంస్థలు కస్టమర్లను కనుగొని కమ్యూనికేట్ చేయడంతో పాటు, వ్యాపారాలను పెంచుకోవడానికి ఈ డీల్ ఉపయోగపడనుంది. భారతదేశంలోని కొత్త ఉద్యోగాలు, చిరు వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికే తాము జియోతో జతకట్టామని ఫేస్ బుక్ అధినేత వెల్లడించారు. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ)

కాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని జియోతో ప్రతిష్టాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో తన డిజిటల్ పరిధిని మరింత విస్తరించుకోవాలనే ప్రణాళికలో భాగాంగా జియోతో  5.7 బిలియన్ డాలర్లు పెట్టుబడుల  ఒప్పందాన్ని  చేసుకుంది. (అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌‌కు షాకివ్వనున్న జియో మార్ట్)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top