మహీంద్రా నుంచి 2 కొత్త ఎస్‌యూవీలు | Mahindra & Mahindra plans to launch three new vehicles, including two compact SUVs, in 2015 | Sakshi
Sakshi News home page

మహీంద్రా నుంచి 2 కొత్త ఎస్‌యూవీలు

Nov 14 2014 1:22 AM | Updated on Oct 8 2018 7:58 PM

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వచ్చే ఏడాది మూడు కొత్త వాహనాలను అందించనున్నది.

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వచ్చే ఏడాది మూడు కొత్త వాహనాలను అందించనున్నది. వీటిలో రెండు స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్స్, ఒకటి తేలిక రకం వాణిజ్య వాహనం  ఉంటాయని కంపెనీ ఈడీ పవన్ గోయెంకా చెప్పారు. శాంగ్‌యాంగ్‌తో కలిసి కొత్త సిరీస్ ఇంజిన్లను రూపొందిస్తామని చెప్పారు. ఇక టూవీలర్ సెగ్మెంట్ విషయానికొస్తే, పీజీయట్ మోటార్ సైకిల్స్‌లో 51 శాతం వాటాను రూ.215 కోట్లకు కొనుగోలు ప్రక్రియ  కొనసాగుతోందని వివరించారు.

ఈ కంపెనీ ఉత్పత్తులను భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా విక్రయించనున్నామని చెప్పారు.  అయితే ఇవి ఖరీదైనవి కావడంతో వీటిని ఎప్పుడు భారత్‌లోకి తెచ్చేది చెప్పలేమని పేర్కొన్నారు. ఈ ఫ్రెంచ్ కంపెనీ తయారీ వనరులను మహీంద్రా 2వీలర్స్ కంపెనీకి వినియోగించుకుంటామని చెప్పారు. మొదటగా మోజో మోటార్‌సైకిల్‌కు ఉపయోగించుకుంటామని, ఇలా తయారు చేసిన మోజోను ఆర్నెళ్లలో భారత్‌లో, ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో అందిస్తామని తెలిపారు.

గెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే ఏడాది అమెరికా, యూరప్ మార్కెట్లలోకి ప్రవేశపెడతామని చెప్పారు. పీజియట్ మోటార్‌సైకిల్స్ కంపెనీని 2-3 ఏళ్లలో బ్రేక్ ఈవెన్‌కు తీసుకురాగలిగితే సంతోషమేనని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో మార్కెట్ పరిస్థితులు అనిశ్చితిగా ఉన్నాయని, ఏదైనా జరగరానిది జరిగితే క్షీణపథంలోకి జారిపోతామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement