పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ రేటు కొనసాగింపు!!

Labour ministry keen to retain 8.65Persant interest rate on EPF deposits for 2019-20 - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20)లో ప్రావిడెంట్‌ ఫండ్‌ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 5న జరిగే ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2018–19లో కూడా ఇదే రేటు ఉంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని 8.5 శాతానికి తగ్గించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. పోస్టాఫీస్‌ పొదుపు పథకాలు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ మొదలైన ఇతరత్రా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల స్థాయికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును కూడా సవరించాలంటూ కార్మిక శాఖపై ఆర్థిక శాఖ ఒత్తిడి తెస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా ప్రతీ ఆర్థిక సంవత్సరం వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో ఆర్థిక శాఖ అభిప్రాయాలను కూడా కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top