కింగ్‌ఫిషర్ పీఎఫ్ అవకతవకలపై విచారణ | Kingfisher Airlines' Provident Fund Contributions To Be Probed: Labour Minister | Sakshi
Sakshi News home page

కింగ్‌ఫిషర్ పీఎఫ్ అవకతవకలపై విచారణ

Mar 14 2016 2:42 AM | Updated on Sep 3 2017 7:40 PM

తమకు జీతాలు చెల్లించకపోయినప్పటికీ, ప్రావిడెండ్ ఫండ్(పీఎఫ్)ను మాత్రం కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ చెల్లించిందని...

కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ
న్యూఢిల్లీ: తమకు జీతాలు చెల్లించకపోయినప్పటికీ, ప్రావిడెండ్ ఫండ్(పీఎఫ్)ను మాత్రం కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ చెల్లించిందని ఈ కంపెనీకి చెందిన మహిళ ఉద్యోగులు ఇటీవల రాసిన లేఖపై కేంద్రం దృష్టి సారిస్తోంది. కింగ్ ఫిషర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాలంలో  ప్రావిడెండ్ ఫండ్ చెల్లింపుల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా లేదా అన్న విషయమై దర్యాప్తు జరపుతామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

ఇప్పటివరకూ ఈ విషయాలను పరిశీలించలేదని, తర్వలోనే దర్యాప్తు జరుపుతామని వివరించారు. కాగా  కింగ్ ఫిషర్ కంపెనీ తమకు వేతన బకాయిలు చెల్లించలేదని పలువురు మాజీ ఉద్యోగులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement