సెల్టోస్‌ ధర పెరిగింది | Kia Seltos Prices Hiked By Up To Rs 35000 | Sakshi
Sakshi News home page

సెల్టోస్‌ ధర పెరిగింది

Jan 4 2020 4:00 AM | Updated on Jan 4 2020 4:00 AM

Kia Seltos Prices Hiked By Up To Rs 35000 - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌.. ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన సెల్టోస్‌ ఎస్‌యూవీ కారు ధరలను పెంచింది. మోడల్‌ ఆధారంగా రూ. 25,000 నుంచి రూ. 35,000 వరకు పెంపుదల ఉంటుందని ప్రకటించింది. గతేడాది అగస్టులో విడుదలైన ఈ కారు ప్రారంభ ధర అంతక్రితం రూ. 9.69 లక్షలు ఉండగా.. పెంపుదల తర్వాత  రూ. 9.89 లక్షలు – 16.29 లక్షలదాకా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇక మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా, రెనో సంస్థలు గతనెల్లోనే కార్ల ధరలను పెంచాయి.

Advertisement
 
Advertisement
Advertisement