
ముంబై: కరోనా వైరస్ విజృంభనతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదైలయింది. ముఖ్యంగా పరిశ్రమలు మూతపడడంతో లక్షలాధి మంది ఉపాధి కోల్పోయారు. కరోనా వైరస్ రాకముందు కంటే ఇప్పుడు 48శాతం అధికంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నారని క్విక్ జాబ్స్ అనే పోర్టల్ నివేదిక తెలిపింది. కాగా దరఖాస్తులలో, ఉద్యోగాల ఖాళీలలో భారీ వ్యత్యాసం ఉందని తెలిపింది. అయితే మెట్రో నగరాలలో ఉద్యోగాల కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు పేర్కొంది.
మరోవైపు ఐఏఎన్‌ఎస్ సర్వే ప్రకారం.. డాటా ఎంట్రీ, డెలివరీ ఎగ్జిక్యూటివ్స, డ్రైవర్, టీచర్, మార్కెటింగ్, సేల్స్ తదితర విభాగాలలో అధిక దరఖాస్తులు వచ్చినట్టు నివేదిక తెలిపింది. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని తెలిపింది. విదేశాలలో ఉద్యోగాలు ఆశించేవారికి విమానయాన సంస్థ ఆంక్షలతో వారి ఆశలకు బ్రేక్ పడింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన వెంటనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: లాక్‌డౌన్: లగ్జరీ కారును అమ్మకానికి పెట్టిన అథ్లెట్)