జియో అద్భుత ఆఫర్‌ : 3.2 టీబీ 4జీ డేటా

Jio Oppo Monsoon Offer: Get Upto 3.2 TB 4G Data And Benefits Of Rs 4900 - Sakshi

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులు విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా మరో కొత్త ఆఫర్‌ - జియో ఒప్పో మాన్‌సూన్‌ ఆఫర్‌ను తన ప్రీపెయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్‌ కింద యూజర్లు 3.2 టీబీ జియో 4జీ డేటాను పొందనున్నారు. 4900 రూపాయల వరకు ప్రయోజనాలను జియో తన ప్రీపెయిడ్‌ యూజర్లకు ఆఫర్‌ చేస్తుంది. ఈ ఆఫర్‌ పాత లేదా కొత్త జియో సిమ్‌ను కలిగి ఉన్న ఒప్పో ఫోన్‌ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ పొందడానికి కొత్త ఒప్పో ఫోనే కొనుగోలు చేయాల్సినవసరం లేదు. జూన్‌ 28 నుంచి ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి మాత్రం సబ్‌స్క్రైబర్లు 198 రూపాయలు, 299 రూపాయల జియో ప్రీపెయిడ్‌ ప్లాన్లతో తమ ఫోన్లకు రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.  

జియో ఒప్పో మాన్‌సూన్‌ ఆఫర్‌..
ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలు... 1800 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు 50 రూపాయల విలువైన 36 క్యాష్‌బ్యాక్‌ ఓచర్ల  రూపంలో పొందనున్నారు.
జియో మనీ క్రెడిట్‌.... 13వ, 26వ, 39వ రీఛార్జ్‌ల అనంతరం 600 రూపాయల చొప్పున మూడు సార్లు యూజర్లకు 1800 రూపాయలు క్రెడిట్‌ కానున్నాయి.
పార్టనర్‌ కూపన్‌ బెనిఫిట్స్‌... మేక్‌మైట్రిప్‌ నుంచి 1300 రూపాయల విలువైన డిస్కౌంట్‌ కూపన్లు అందుబాటులో ఉండనున​ఆనయి.
ఆఫర్‌ ప్రారంభ తేదీ.. 2018 జూన్‌ 28
మైజియో యాప్‌లో ఉన్న ఫోన్‌ పే ద్వారా రీఛార్జ్‌ చేసుకున్న వారికి రూ.50 క్యాష్ బ్యాక్‌ ఓచర్లు వెంటనే పొందవచ్చు. రూ.299 రీఛార్జ్‌పై ప్రస్తుతం జియో 126 జీబీ డేటాను అందిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top