ఇది పండుగ కానుక: వాహన రంగం హర్షం

ఇది పండుగ కానుక: వాహన రంగం హర్షం


న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్ల తగ్గింపును పండుగ కానుకగా ఆటోమొబైల్ సంస్థలు అభివర్ణించాయి. సాధారణంగా పండుగల సీజన్‌లో ఆటోమొబైల్ అమ్మకాలు కనీసం 15-20 శాతం పెరుగుతాయని, కానీ గత కొద్ది సంవత్సరాలుగా అలా జరగడం లేదని పేర్కొన్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపుతో ఈసారి మళ్లీ ఆ మేర అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని హ్యుందాయ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాస్తవ చెప్పారు.  కస్టమర్లకు ఇది సానుకూల సంకేతమని మారుతీ సుజుకీ ఈడీ  ఆర్‌సీ కాల్సీ అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top