30 నుంచి ఐఆర్‌సీటీసీ ఐపీఓ

IRCTC plans to launch IPO on 30 September as markets rebound - Sakshi

ప్రైస్‌బ్యాండ్‌ రూ.315–320

రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ.10 డిస్కౌంట్‌ 

వచ్చే నెల 14న మార్కెట్లో లిస్టింగ్‌

ముంబై: ప్రభుత్వ రంగ ఐఆర్‌సీటీసీ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నది. వచ్చే నెల 3న ముగిసే ఈ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్‌ను రూ.315–320గా నిర్ణయించామని ఇండియన్‌  రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) వెల్లడించింది. ఈ ఐపీఓ ఇష్యూ సైజు రూ.645 కోట్లు. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల 2.01 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఈ మొత్తంలో 1,60,000 షేర్లను ఉద్యోగులకు రిజర్వ్‌ చేశారు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు ఒక్కో షేర్‌కు రూ.10 డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. స్టాక్‌ మార్కెట్లో  ఈ షేర్లు వచ్చే నెల 14న లిస్టవుతాయి. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ సర్వీసెస్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, యస్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) వ్యవహరిస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా లభించే సొమ్ములను వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, రుణాల చెల్లింపునకు, ఇతర కంపెనీలను కొనుగోలు చేయడానికి వినియోగిస్తారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top