ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు

 iPhone Fest  Discounts on Amazon  - Sakshi

అమెజాన్ ఇండియా 'ఐఫోన్ ఫెస్ట్' 

వివిధ మోడళ్ల ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు 

హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై రూ.5వేలదాకా  డిస్కౌంట్‌

సాక్షి, ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా   మరోసారి  ‘ఐ ఫోన్‌ ఫెస్ట్‌’ అమ్మకాలకు తెర తీసింది.  అమెజాన్‌ వెబ్‌సైట్, యాప్‌లలో ఐఫోన్ ఫెస్ట్ పేరిట  నిర్వహిస్తున్న  స్పెషల్‌ సేల్‌ను మంగళవారం ప్రారంభించింది. ఈ నెల 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక విక్రయాలు   కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా దాదాపుగా అన్ని ఐఫోన్ మోడల్స్  స్మార్ట్‌ఫోన్లు భారీ తగ్గింపు ధరలతో వినియోగదారులకు లభిస్తున్నాయి. ఐఫోన్ ఎ‍క్స్‌, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 6ఎస్‌, ఐఫోన్ 6 , ఐఫోన్ ఎస్‌ఈ  లాంటి స్మార్టఫోన్లపై డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు అందిస్తోంది. అంతేకాదు  ఎంపిక చేసిన ఆపిల్ వాచ్‌ మోడల్స్‌పై   ప్రత్యేక  తగ్గింపు అందుబాటులో ఉంది.  

ముఖ్యంగా  ఐఫోన్ ఎక్స్‌ 256జీబీ రూ.97,999కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర (ఎంఆర్‌పీ) రూ.1,08,930గా ఉంది.   ఇదే స్మార్ట్‌ఫోన్‌ 64జీబీ వేరియంట్‌ అసలు ధరల రూ.95,390  ఉండగా  ప్రస్తుతం ఐఫోన్ ఫెస్ట్‌లో ఇది రూ.79,999 ధరకు లభిస్తున్నది. ఐఫోన్ 8 (64 జీబీ) రూ.54,999 కు (ఎంఆర్‌పీ రూ.67,940), ఐఫోన్ 8 (256జీబీ) రూ.68,999కు (ఎంఆర్‌పీ రూ.81,500), ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ రూ.65,999కు (ఎంఆర్‌పీ రూ.77,560), ఐఫోన్ 8 ప్లస్ 256జీబీ రూ.79,999కు (ఎంఆర్‌పీ రూ.91,110) లభిస్తున్నాయి.

ఐఫోన్ ఫెస్ట్‌లో ఐఫోన్ 7 (32జీబీ) - రూ.41,999కు (ఎంఆర్‌పీ రూ.52,370)
ఐఫోన్ 7 (128 జీబీ) -రూ.54,999 (ఎంఆర్‌పీ రూ.61,560)
ఐఫోన్ 7 ప్లస్ 32జీబీ -రూ.56,999 (ఎంఆర్‌పీ రూ.62,480)
ఐఫోన్ 7 ప్లస్ 128 జీబీ -రూ.64,999 (ఎంఆర్‌పీ రూ.72,060)
ఐఫోన్ 6ఎస్ 32జీబీ -రూ.33,999 (ఎంఆర్‌పీ రూ.42,900)
ఐఫోన్ 6ఎస్ ప్లస్ 32- జీబీ రూ.37,999 (ఎంఆర్‌పీ రూ.52,240)
ఐఫోన్ 6 (32జీబీ) -రూ.23,999కు (ఎంఆర్‌పీ రూ.31,900)
ఐఫోన్ ఎస్‌ఈ 32 జీబీ -రూ.17,999 (ఎంఆర్‌పీ రూ.26వేలు) 
అదేవిధంగా యాపిల్ వాచ్ సిరీస్ 3 జీపీఎస్ 38 ఎంఎం రూ.32,380కి (ఎంఆర్‌పీ రూ.32,380), యాపిల్ వాచ్ సిరీస్ 3 జీపీఎస్ 42ఎంఎం రూ.31,900కి (ఎంఆర్‌పీ రూ.34,410) లభిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌కూడా లభ్యం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top