విశాల్‌ సిక్కాకు మరో ఎదురు దెబ్బ | Infosys’s Ritika Suri, who led the Panaya acquisition, has resigned | Sakshi
Sakshi News home page

విశాల్‌ సిక్కాకు మరో ఎదురు దెబ్బ

Jul 18 2017 10:35 AM | Updated on Sep 5 2017 4:19 PM

విశాల్‌ సిక్కాకు మరో ఎదురు దెబ్బ

విశాల్‌ సిక్కాకు మరో ఎదురు దెబ్బ

ప్రముఖ ఐటీసేవల సంస్థ ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌ సిక్కాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీకి చెందిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ తాజాగా గుడ్‌ బై చెప్పారు.

బెంగళూరు:  ప్రముఖ ఐటీసేవల సంస్థ  ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌ సిక్కాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీకి చెందిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌  తాజాగా  గుడ్‌ బై  చెప్పారు.  ఇన్ఫోసిస్  లార్జ్‌ డీల్స్‌ బాస్‌ రితికా  సూరి రిజైన్‌ చేశారు.   ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్  పనాయా ఒప్పందంలో కీలక పాత్ర వహించిన రితికా సంస్థను వీడారు.   సిక్కాతో  సంస్థలో జాయిన్‌ అయిన రితిక అత్యధిక వేతన తీసుకుంటున్న  వారిలో రితికా  కూడా ఒకరు. ముఖ్యంగా మొబైల్‌ సంస్థ స్కవా,  పనాయా ఒప‍్పందంలోఎలాంటి లోపాలు కనబడలేదని తేల్చిన అనంతరం చోటు చేసుకున్న ఆమె రాజీనామా ఆసక్తికరంగామారింది. అయితే  ఈ వార్తను ఇంకా అధికారికంగా  ధృవీకరించాల్సి ఉంది.

ఇన్ఫోసిస్ లిమిటెడ్లో భారీ ఒప్పంద బృందానికి  ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ముఖ‍్యంగా ఇటీవల విలీనం, స్వాధీనాలకు సంబంధిత కీలక బాధ్యతలను స్వీకరించిన రితికా, పనాయా  తో సహా రెండు కీలక ఒప్పందాలకు ఇన్ఫీ అంతర్గత  విచారణ కమిటీ క్లీన్‌ చిట్‌ ఇచ్చిన అతి తక్కువ సయయంలోనే తన పదవికి రాజీనామా చేయడం చర్చకు తెరతీసింది. గతంలో విలీల్ సిక్కా  (ఎం అండ్ అస్) ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు,

కాగా ఇటీవల అమెరికాకు చెందిన న్యాయ సంస్థ చేసిన దర్యాప్తులో పన్యా, మొబైల్ కామర్స్ సంస్థ స్వావాతో సహా రెండు కంపెనీలు కొనుగోలు చేయాలనే  విషయంలో మేనేజ్మెంట్ నిర్ణయంలో ఎటువంటి దోషమూ లేదని తేల్చింది. ఆగస్ట్ 2014 లో  విశాల్‌ సిక్కా సీఈవోగా బాధ్యతలు స్వీకరిచిన  తరువాత కీలక ఎగ్జిక్యూటివ్‌ సందీప్‌ దాడ్లని,  తాజాగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సూరి సహా, ఇంకా 10 మంది కార్యనిర్వాహకులు  ఇన్ఫోసిస్ నుంచి నిష్క్రమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement