ఇండిగో ఇండిపెండెన్స్‌ డే సేల్‌

IndiGo offers flight tickets from Rs 981 in new sale - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద క్యారియర్‌ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కూడా ఇండిపెండెన్స్‌ డే ఆఫర్‌ ప్రకటించింది. స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా  ఇతర విమానయాన సంస్థలు డిస్కౌంట్ స్కీమ్‌లను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇండిగో కూడా రూ. 981కే విమాన టికెట్‌ను అందిస్తోంది. ఎంపిక చేసిన మార్గాల్లో  పరిమితకాల ఆఫర్‌ కింద  పరిమిత సీట్లను అందిస్తున్నట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.  ఆగస్టు 15లోపు  మాత్రమే ఈ ఆఫర్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.ఇలా బుక్‌ చేసుకున్నటికెట్ల ద్వారా సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 8 మధ్య ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. 

వెబ్‌సైట్‌  అందించిన సమాచారం శ్రీనగర్‌, జమ్ము మధ్య రూ.981 టికెట్‌ను అందిస్తుండగా  హైదరాబాద్-అహ్మదాబాద్ (రూ.1,992), హైదరాబాద్-లక్నో (రూ.2,456), కోల్కతా-బెంగళూరు (రూ .3,634), కోలకతా-భువనేశ్వర్ (రూ .1,379), కోలకతా-ఢిల్లీ (రూ. 2,836), కోలకతా-హైదరాబాద్ (రూ.2,594) ముంబై-బెంగళూరు (రూ.1,748), ముంబై-ఢిల్లీ (రూ .2,255), బెంగళూరు-ఢిల్లీ (రూ .2,929) అహ్మదాబాద్-బెంగళూరు (రూ.2,078), అహ్మదాబాద్-ఢిల్లీ (రూ.1,415), బాగ్డోగ్ర-కోల్‌కతా (రూ .1,613), బెంగళూరు-గోవా (రూ.1,782), బెంగళూరు-గోవా (బెంగళూరు) రూ.1,782), గౌహతి-కోల్‌కతా (రూ .1,793) ధరల్లో విమాన టికెట్లు లభ్యం కానున్నాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top