
కోయంబత్తూర్: దేశంలోనే అతిపెద్ద వర్క్‌షాప్‌ను స్కోడా ఆటో ఇండియా తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఏర్పాటు చేసింది. ‘ఇండియా 2.0’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎస్‌జీఏ కార్స్ ఇండియాతో కలిసి ఈ సర్వీస్ అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. ఏడాదికి 20,000 స్కోడా వాహనాలను సర్వీసింగ్ చేయగలిగే విధంగా 49,585 చదరపు అడుగుల్లో ఈ సెంటర్ రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా సంస్థ సేల్స్, సర్వీస్, అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోల్లిస్ మాట్లాడుతూ.. ‘దక్షిణ భారతదేశంలో మార్కెట్ వాటా పెంచాలనే లక్ష్యంతో కార్పొరేట్ ప్రమాణాలతో వర్క్‌షాప్‌ను ప్రారంభించాం. కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే భావనతో అధునాతన సేవలను అందిస్తున్నాం’ అని అన్నారు.