స్థిర వృద్ధి బాటన భారత్: ఓఈసీడీ | Sakshi
Sakshi News home page

స్థిర వృద్ధి బాటన భారత్: ఓఈసీడీ

Published Tue, Jan 12 2016 12:55 AM

స్థిర వృద్ధి బాటన భారత్: ఓఈసీడీ

లండన్: భారత్ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక విశ్లేషణా సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో పలు అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి ధోరణి మిశ్రమంగా కనిపిస్తోందని తెలిపింది. భారత్ వృద్ధి క్రియాశీలతకు సంబంధించి అక్టోబర్‌లో కాంపోసిట్ లీడింగ్ ఇండికేటర్స్(సీఎల్‌ఐ) 100.2 పాయింట్ల వద్ద ఉంది. అయితే నవంబర్‌లో ఈ పాయింట్లు 100.4 పాయింట్లకు పెరిగింది.  చైనా, బ్రెజిల్‌కు సంబంధించి తాత్కాలిక వృద్ధి ధోరణి కనిపిస్తుండగా.. రష్యా మాత్రం మందగమనంలోకి జారుతోంది.

యూరో ప్రాంతంలో స్థిర వృద్ధి ధోరణి కనబడుతున్నట్లు తెలిపింది. ప్రత్యేకించి జర్మనీ, ఇటలీ విషయంలో సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కెనడా, జపాన్, ఫ్రాన్స్‌ల విషయంలోనూ స్థిర వృద్ధి సానుకూలతలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్‌లు గరిష్ట స్థాయి సీఎల్‌ఐ నుంచి స్వల్పంగా జారాయి.

Advertisement
Advertisement