వేగంగా వృద్ధి చెందుతున్నా..ఎన్నెన్నో వెనుకడుగులు! | India ranks 130th in 2015 Human Development Index | Sakshi
Sakshi News home page

వేగంగా వృద్ధి చెందుతున్నా..ఎన్నెన్నో వెనుకడుగులు!

Jul 15 2016 1:29 AM | Updated on Sep 4 2017 4:51 AM

వేగంగా వృద్ధి చెందుతున్నా..ఎన్నెన్నో వెనుకడుగులు!

వేగంగా వృద్ధి చెందుతున్నా..ఎన్నెన్నో వెనుకడుగులు!

దక్షిణాసియాలోని పలు ఇరుగుపొరుగు దేశాలతో పోల్చితే పలు ఆర్థిక, సామాజిక రంగాల్లో భారత్ వెనుకబడి ఉందని ఐక్యరాజ్య సమితి రూపొందించిన 2015 మానవ అభివృద్ధి నివేదిక ఒకటి తెలిపింది.

భారత్‌పై ఐరాస మానవ వనరుల నివేదిక

 న్యూఢిల్లీ: దక్షిణాసియాలోని పలు ఇరుగుపొరుగు దేశాలతో పోల్చితే పలు ఆర్థిక, సామాజిక రంగాల్లో భారత్ వెనుకబడి ఉందని ఐక్యరాజ్య సమితి రూపొందించిన 2015 మానవ అభివృద్ధి నివేదిక ఒకటి  తెలిపింది. నివేదిక దక్షిణ ఆసియాలో ఇరాన్‌ను కూడా కలిపింది. 2005-2014 మధ్య వివిధ అంతర్జాతీయ సంస్థలు సేకరించిన సమాచారం ప్రాతిపదికన ఈ నివేదిక రూపొందింది.  దీని ప్రకారం చూస్తే...

  2013లో భారత్ తలసరి ఆదాయం 5,238 డాలర్లు. ఇది ఇరాన్‌లో పోల్చితే 65% తక్కువ. మాల్దీవులతో (11,238 డాలర్లు) పోల్చిచూస్తే 54% తక్కువ. శ్రీలంకతో (9,426 డాలర్లు)తో పోల్చి చూసినా 44% తక్కువ. భూటాన్‌తో పోల్చితే 27% (7,167 డాలర్లు) తక్కువ.

  2002-2012 లెక్క ప్రకారం రోజుకు 1.25 డాలర్ల కొనుగోలు శక్తి సామీప్యత (పీపీపీ) ప్రాతిపదికన దారిద్య్ర రేఖ దిగువన ఉన్న  ప్రజల సంఖ్య భూటాన్‌లో 2.4%. మాల్దీవుల్లో 6.3%. పాకిస్తాన్‌లో 12.7%. భారత్‌లో 23.6%. నేపాల్‌లో 23.7%. 43.3%తో బంగ్లాదేశ్ అట్టడుగున ఉంది. కాగా 2015 అక్టోబర్‌లో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ‘ఇండియా స్పెండ్ రిపోర్ట్’ ప్రకారం, 2011-12లో 21 %గా ఉన్న భారత్ పేదరికం రేటు..ఇప్పుడు 12.4%కి తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement