క్యాష్‌ ఈజ్‌ కింగ్‌! 

Increased savings in cash form - Sakshi

నగదు రూపంలో పెరిగిన పొదుపులు

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రూపంలో ఇంటింటి పొదుపులు గణనీయంగా పెరిగాయి. 2017–18లో స్థూల జాతీయ డిస్పోజబుల్‌ ఇన్‌కమ్‌(జీఎన్‌డీఐ–ఆదాయపు పన్నులు తదితర వ్యయాల తర్వాత ఖర్చులకు, పొదుపుకు కుటుంబం వద్ద ఉండే మొత్తమే డిస్పోజబుల్‌ ఇన్‌కమ్‌)తో పోల్చిచూస్తే, నగదు రూపంలో ఇంటింటి పొదుపు 2.8%కి పెరిగింది. ఇది ఏడేళ్ల గరిష్ట స్థాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)

తాజా గణాంకాల్లో మరిన్ని వివరాలు... 
82016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు జరిగింది. అటు తర్వాత గృహ పొదుపులు అసలు పెరక్కపోగా అంతక్రితం ఏడాది (2015–16) తో పోల్చితే 2016–17లో  2 శాతం క్షీణించింది.  
82016–17లో జీఎన్‌డీఐలో గృహ ఫైనాన్షియల్‌ సేవింగ్స్‌ కూడా 6.7% క్షీణించాయి. 2015–16లో ఏకంగా 8.1% వృద్ధి నమోదయ్యింది. అయితే 2017–18లో ఈ రేటులో 7.1% వృద్ధి నమోదైంది.  
8డిపాజిట్ల రూపంలో పొదుపులు డీమోనిటైజేషన్‌ ఇయర్‌ (2016–17) లో 6.3 శాతం పెరిగితే, 2017–18లో ఈ రేటు 2.9 శాతానికి జారిపోయింది.  
8షేర్లు, డిబెంచర్లలో పొదుపులు 2015–16లో 0.3 శాతం ఉంటే, 2017–18లో 0.9 శాతానికి ఎగశాయి. స్టాక్‌ మార్కెట్‌ బూమ్‌కు ఇది నిదర్శనం.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top