వొడాఫోన్‌ డీల్‌: ఐటీ భారీ జరిమానా

వొడాఫోన్‌ డీల్‌: ఐటీ భారీ జరిమానా

సాక్షి, న్యూఢిల్లీ : వొడాఫోన్‌ భారీ డీల్‌కు సంబంధించి పన్ను సరిగ్గా కట్టనందుకు బిలీనియర్‌ లీ కా-సింగ్‌కు చెందిన హచిసన్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు ఆదాయపు పన్ను శాఖ జారీ మొత్తంలో జరిమానా విధించింది. రూ.7900 కోట్ల పన్ను డిమాండ్‌కు అంతేమొత్తంలో పెనాల్టీ వేసింది. పన్ను, వడ్డీ, జరిమానాలు మొత్తం కలిపి రూ.32,320 కోట్లు చెల్లించాలని హచిసన్‌ను ఆదాయపు పన్ను శాఖ ఆదేశించింది. భారత్‌లో తమ మొబైల్‌ వ్యాపారాలను 11 బిలియన్‌ డాలర్లకు 2007లో యూకే వొడాఫోన్‌ గ్రూప్‌కు విక్రయించారు. ఈ డీల్‌లో హచిసన్‌ టెలికాం భారీగా లబ్ది పొందిందని, కానీ పన్నులు సరిగ్గా చెల్లించలేదని తెలిసింది. ఈ నోటీసుల్లో పన్ను రూ.7900 కోట్లు కాగ, రూ.16,430 కోట్లు వడ్డీ, రూ.7900 కోట్లు పెనాల్టీ కింద తమకు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేసినట్టు హచిసన్‌ తన హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. 

 

మొత్తం రూ.16, 430 కోట్ల ల‌బ్ధి పొందినందు వ‌ల్ల త‌మ‌కు రూ.7900 కోట్ల ప‌న్ను చెల్లించాల‌ని ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ హ‌చిస‌న్‌ను ఆదేశించింది. ఆ మొత్తం చెల్లించ‌నందు వ‌ల్ల అంతే మొత్తంలో పెనాల్టీని ఇప్పుడు ఐటీ శాఖ విధించింది. అయితే హచిసన్‌ నుంచి భారత్‌లో ఆస్తులు కొనుగోలు చేస్తే ఎలాంటి పన్ను చెల్లించాల్సినవసరం లేదని కంపెనీ వాదిస్తోంది. 2012 జనవరిలో సుప్రీంకోర్టు ఆదేశాలకు ఈ పన్ను నోటీసులు విరుద్దంగా ఉన్నాయని పేర్కొంది. పన్ను నోటీసులు అందుకున్న హచిసన్‌ తన మొత్తం 67 శాతం భారత వ్యాపారాలను వొడాఫోన్‌కు విక్రయించింది. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top