ఆర్థిక వ‍్యవస్ధను అలా వదిలేయకండి..

IMF Calls For Urgent Action By India - Sakshi

వాషింగ్టన్‌ : ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే భారత ఆర్థిక వ్యవస్థను స్లోడౌన్‌ సెగల నుంచి తప్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఐఎంఎఫ్‌ భారత్‌ను కోరింది. వినియోగం, పెట్టుబడులు మందగించడం, పన్ను రాబడి పడిపోవడం వంటి సమస్యలతో దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీకి అవరోధంగా నిలిచాయని ఐఎంఎఫ్‌ తన వార్షిక సమీక్షలో పేర్కొంది. లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడవేసిన అనంతరం భారత్‌ ఇప్పుడు ఆర్థిక మందగమనం గుప్పిట్లో కూరుకుపోయిందని ఐఎంఎఫ్‌ ఆసియా పసిఫిక్‌ విభాగానికి చెందిన రణిల్‌ సల్గాదో వ్యాఖ్యానించారు.

ప్రస్తుత మందగమనాన్ని అధిగమించి తిరిగి వృద్ధి పధంలో పయనించేందుకు భారత్‌ తక్షణ విధాన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. అయితే ఇప్పటికే అధిక రుణాలు, వడ్డీ చెల్లింపులతో సతమతమవుతున్న భారత్‌ వృద్ధిని గాడిలో పెట్టేందుకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే స్థితిలో ప్రభుత్వం లేదని హెచ్చరించింది.

చదవండి : నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి పెట్టాలి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top