టోరెంట్ ఫార్మా చేతికి జిగ్ ఫార్మా | Image for the news result Torrent Pharma to acquire 100% stake in Zyg Pharma | Sakshi
Sakshi News home page

టోరెంట్ ఫార్మా చేతికి జిగ్ ఫార్మా

May 6 2015 1:48 AM | Updated on Apr 8 2019 7:51 PM

టోరెంట్ ఫార్మా చేతికి జిగ్ ఫార్మా - Sakshi

టోరెంట్ ఫార్మా చేతికి జిగ్ ఫార్మా

ఎన్‌కోర్ గ్రూప్‌లో భాగమైన జిగ్ ఫార్మాను కొనుగోలు చేసేందుకు ఫార్మా దిగ్గజం టోరెంట్ ఒప్పందం కుదుర్చుకుంది.

న్యూఢిల్లీ: ఎన్‌కోర్ గ్రూప్‌లో భాగమైన జిగ్ ఫార్మాను కొనుగోలు చేసేందుకు ఫార్మా దిగ్గజం టోరెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం ఎంత వెచ్చిస్తున్నదీ వెల్లడి కాలేదు. జిగ్ ఫార్మాలో 100 శాతం వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టోరెంట్ ఫార్మా బీఎస్‌ఈకి వెల్లడించింది. చర్మ సంబంధ ఆయింట్‌మెంట్లు, జెల్స్, లోషన్లు మొదలైన ఉత్పత్తులను జిగ్ ఫార్మా తయారు చేస్తోంది. అమెరికా, యూరప్ మొదలైన మార్కెట్లలో డె ర్మటాలాజికల్ ఉత్పత్తుల విభాగంలో స్థానం పటిష్టం చేసుకునేందుకు జిగ్ కొనుగోలు ఉపయోగపడగలదని టోరెంట్ పేర్కొంది. ఇరు కంపెనీల బోర్డులు దీనికి ఆమోదం తెలిపినట్లు వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement