
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 23 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.340 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.261 కోట్లకు తగ్గిందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది.
మొత్తం ఆదాయం మాత్రం రూ.7,137 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా పెరిగి రూ.16,054 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.1.55 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ ఎంబెడెడ్ వేల్యూ(ఈవీ) 15 శాతం పెరిగి రూ.21,623 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది.