కేవలం 25వేలతో ఈ కారు బుకింగ్స్‌

కేవలం 25వేలతో ఈ కారు బుకింగ్స్‌

హ్యుందాయ్‌ వచ్చే నెలలో మార్కెట్లోకి తీసుకురాబోతున్న కొత్త వెర్నా బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. అధికారికంగా హ్యుందాయ్‌ ఈ బుకింగ్స్‌ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, డీలర్స్‌ మాత్రం ఇండియాలో కొత్త వెర్నా బుకింగ్స్‌ చేపడుతున్నట్టు తెలిసింది. ఈ సెడాన్‌ వాహనాన్ని ఆగస్టు 15 లేదా 20 తేదీల్లో లాంచ్‌ చేయనున్నారని హ్యుందాయ్‌ డీలర్స్‌ చెబుతున్నారు. కేవలం రూ.25వేలతో ఈ కారును బుక్‌ చేసుకోవచ్చని డీలర్స్‌ పేర్కొన్నారు. అయితే వివిధ వేరియంట్లలో రాబోతున్న ఈ కారు ధరెంతో ఉంటుందో ఇంకా స్పష్టంకాలేదు. హ్యుందాయ్‌ వెర్నా భారత్‌లోకి ప్రవేశించిన తొలి ఫ్లూయిడ్‌ మోడల్‌. హ్యుందాయ్‌ ఫ్యూయిడ్‌ కార్లకు ఇప్పటికీ భారత్‌లో మంచి డిమాండ్‌ ఉంది. 

 

అయితే వెర్నాకు మాత్రమే డిమాండ్‌ తగ్గింది. కారు వినియోగదారులు ఎక్కువగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్స్‌, క్రాస్‌ఓవర్స్‌, కాంపాక్ట్‌ ఎస్‌యూవీలపై ఎక్కువగా దృష్టిపెట్టడంతో వె‍ర్నాకు డిమాండ్‌ పడిపోయింది. వెర్నా హవాను మళ్లీ భారత్‌లో పునరుద్ధరించడానికి కొత్త వెర్నా కారు గుడ్‌ ఛాయిస్‌గా నిలుస్తుందని ఆటో వర్గాలు పేర్కొంటున్నాయి. ఫ్లూయిడ్‌ డిజైన్‌లో తీసుకొచ్చిన తొలి వెర్నా ఇప్పటికీ మార్కెట్‌లో ఉంది.  

 

ప్రస్తుతం లభించే వెర్నా కన్నా మార్కెట్‌లోకి రాబోతున్న వెర్నా పెద్దదిగానే ఉంటుందని తెలుస్తోంది. మునుపటి వెర్నా కన్నా 70ఎమ్ఎమ్ పొడవు, 29ఎమ్ఎమ్ వెడల్పు, 10ఎమ్ఎమ్ వీల్ బేస్ పెరుగుతుందట. కారు మొత్తం ఎత్తు పెరగకపోయినప్పటికీ క్యాబిన్ స్పేస్ ఎక్కువగా ఉండనుంది. 2017 వెర్నా సెడాన్‌లో హ్యుందాయ్‌ సేఫ్టీకి పెద్ద పీట వేయనుందని, ఇందులో ప్రత్యేకించి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి స్టాండర్డ్ ఫీచర్లున్నాయని తెలుస్తోంది. టాప్ ఎండ్ వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ అసిస్ట్ ఫీచర్లు ఉండనున్నాయని సమాచారం. 

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top