‘లాక్‌డౌన్‌ తర్వాత వేగంగా నియామకాలు’

Huge Employment Opportunites After Lockdown Relaxations - Sakshi

ముంబై: లాక్‌డౌన్‌ సడలింపులతో కంపెనీలు ఉద్యోగులను నియమించేందుకు వేగంగా ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత రెండు, మూడు వారాలుగా ఈ కామర్స్‌, డేటా ప్రాసెసింగ్‌, బ్యాంకింగ్‌, డిజిటల్‌ నిపుణులు తదితర రంగాలలో ఉపాధి అవకాశాలు పుంజుకున్నామని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, లాక్‌డౌన్‌ సమయంలో 80 శాతం కంపెనీలు ఉద్యోగ నియామకాలవైపు ఆసక్తి చూపలేదని, కానీ లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత 50 శాతం సంస్థలు ఉద్యోగ నియామకాలకై ఆసక్తి కనబరుస్తున్నాయని సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ సీఈఓ ఆధిత్యా మిశ్రా తెలిపారు.

కానీ పర్యాటక రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. కాగా రాండ్ ‌స్టాండ్‌ ఇండియా సంస్థ అధికారి సంజయ్‌ శెట్టి స్పందిస్తూ.. తయారీ రంగం, టెలికాం రంగంలో కొంత మేర వృద్ధి నమోదు కావచ్చని తెలిపారు. అయితే ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్’‌కు సంస్థలు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో శుభపరిణామని శెట్టి అన్నారు. కాగా నైపుణ్యం ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని టీమ్‌ లీస్‌ సర్వీసెస్‌ సహ వ్యవస్థాపకురాలు రితుపర్నా చక్రవర్తి పేర్కొన్నారు. (చదవండి: మరోసారి లాక్‌డౌన్‌ దిశగా చైనా..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top