బిగ్‌ స్క్రీన్‌, డ్యుయల్‌ రియర్‌ కెమెరా, బడ్జెట్‌ ధర | Huawei Honor 7C With Face Unlock Launched | Sakshi
Sakshi News home page

బిగ్‌ స్క్రీన్‌, డ్యుయల్‌ రియర్‌ కెమెరా, బడ్జెట్‌ ధర

Mar 12 2018 5:29 PM | Updated on Mar 12 2018 7:29 PM

Huawei Honor 7C With Face Unlock  Launched - Sakshi

బీజింగ్‌: హువాయి తాజాగా  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.   హానర్‌ సీ సిరీస్‌లో కొత్త   స్మార్ట్‌ఫోన్‌ను  హానర్  7సీ పేరుతో  ఫేస్‌ అన్‌లాక్‌  ప్రధాన ఫీచర్‌గా  లాంచ్‌  చేసింది.   చైనామార్కెట్లో మార్చి 13నుంచి విక్రయానికి లభ్యం. అయితే గ్లోబల్‌ మార్కెట్లో ఎప్పటినుంచి అందుబాటులో ఉండేది ఇంకా వెల్లడి కాలేదు. రెండు వేరియట్లలో ఇది లాంచ్‌ కాగా 3జీబీ/32 జీబీ స్టోరేజ్‌ ధర  సుమారు రూ.9000 గాను,  4జీబీ/64జీబీవేరియంట్‌   సుమారు ధర రూ. 13,400 గా ఉండనుంది.

హానర్ 7సీ ఫీచర్లు
5.99 అంగుళాల  డిస్‌ప్లే 18.9 యాస్పెక్ట్‌ రేషియో
1.8 గిగా హెడ్జ్‌ ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌
720x1440  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో
3 జీబీ ర్యామ్‌
32 జీబీ స్టోరేజ్‌
256 దాకా విస్తరించుకునే సదుపాయం
8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
13 +2 ఎంపీ  డ్యుయల్‌ రియర్‌ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
 
Advertisement
Advertisement