సాక్షి, ముంబై: తైవాన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ హెచ్‌టీసీ బుధవారం రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. డిజైర్ సిరీస్‌లో హెచ్‌టీసీ డిజైర్ 12, హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ డివైస్‌లను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. హెచ్‌టీసీ డిజైర్ 12 ధరను 15,800 రూపాయలుగానూ, హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ ధరను 19,790గా ను నిర్ణయించింది. గురువారం నుంచి ప్రీ ఆర్డర్‌లను ప్రారంభించనుంది. జూన్ 11 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు మొదలుకానున్నాయి. 18.9 యాస్పెక్ట్ రేషియో, ఎడ్జ్ టూఎడ్జ్ డిస్‌ప్లే తమ నూతన స్మార్ట్‌ఫోన్ల సొంతమనికంపెనీ చెబుతోంది.
హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ ఫీచర్లు  
6అంగుళాల హెచ్‌డీ + ఐపీఎస్  డిస్‌ప్లే 
క్వాల్కం స్నాప్ డ్రాగన 450 ఎస్‌వోసీ  ప్రాసెసర్ 
720x1440 రిజల్యూషన్
3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
13+2 ఎంపీ  డ్యుయల్ రియర్  కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
2965 ఎంఏహెచ్ బ్యాటరీ
హెచ్‌టీసీ డిజైర్ 12 ఫీచర్లు  
5.5 అంగుళాల హెచ్‌డీ + ఐపీఎస్  డిస్‌ప్లే
720x1440  రిజల్యూషన్
మీడియా టెక్ ఎంటీ 6739  క్వాడ్ కోర్ ప్రాసెసర్ 
3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 
2టీబీ దాకా విస్తరించుకునే అవకాశం
13ఎంపీ రియర్ కెమెరా
5  ఎంపీ  సెల్ఫీ కెమెరా
2,730 ఎంఏహెచ్ బ్యాటరీ 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
