మార్కెట్‌లోకి ‘హానర్‌ 8 ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ | Honor 8 Pro With 6GB of RAM, Dual Rear Cameras Launched in India | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ‘హానర్‌ 8 ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌

Jul 7 2017 1:05 AM | Updated on Nov 6 2018 5:26 PM

మార్కెట్‌లోకి  ‘హానర్‌ 8 ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ - Sakshi

మార్కెట్‌లోకి ‘హానర్‌ 8 ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌

ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘హువావే’ సబ్‌బ్రాండ్‌ హానర్‌ తాజాగా ‘హానర్‌ 8 ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ను

ధర రూ.29,999
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘హువావే’ సబ్‌బ్రాండ్‌ హానర్‌ తాజాగా ‘హానర్‌ 8 ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.29,999గా ఉంది. ఆండ్రాయిడ్‌ నుగోట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.7 అంగుళాల క్యూహెచ్‌డీ స్క్రీన్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. ‘హానర్‌ 8 ప్రొ’ స్మార్ట్‌ఫోన్లు కస్టమర్లకు అమెజాన్‌ ఇండియాలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండనున్నాయి. వీటిని ప్రైమ్‌ యూజర్లు జూలై 10 నుంచి, ఇతరులు జూలై 13 నుంచి కొనుగోలు చేయవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement