హానర్‌ 7ఎక్స్‌ వచ్చేసింది..హైలైట్‌ ఏంటి? | Honor 7X With 18:9 Display, Dual Cameras Launched in India | Sakshi
Sakshi News home page

హానర్‌ 7ఎక్స్‌ వచ్చేసింది..హైలైట్‌ ఏంటి?

Dec 6 2017 9:18 AM | Updated on Nov 6 2018 5:26 PM

Honor 7X With 18:9 Display, Dual Cameras Launched in India - Sakshi

హువావే  బ్రాండ్‌లో  హానర్‌  మరో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను  లాంచ్‌ చేసింది. హానర్‌ 7 ఎక్స్‌  పేరుతో దీన్ని  భారత మార్కెట్లో విడుదల చేసింది.  18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన ఫుల్ వ్యూ డిస్‌ప్లే , డ్యూయల్‌ రియర్‌ కెమెరా ప్రధాన ఫీచర్లుగా దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. స్టోరేజ్‌ పరంగా రెండు వేరియంట్లలో ఇది  లభ్యంకానుంది.  32జీబీ వేరియంట్‌ ధరను రూ.12,999గా, 64జీబీ వేరియంట్‌ ధరను రూ. 15,999గా నిర్ణయించింది.  ప్రత్యేకంగా అమెజాన్‌లో డిసెంబర్‌ 7వ  తేదీ మధ్నాహ్నం 12గంటలకు కొనుగోలుకు లభ్యం.

హానర్ 7ఎక్స్ ఫీచర్లు

5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ  డిస్‌ప్లే
2.5డి కర్వ్‌డ్ గ్లాస్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
32/64 జీబీ స్టోరేజ్
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3340 ఎంఏహెచ్ బ్యాటరీ
 

Advertisement
 
Advertisement
Advertisement