పెరగనున్న హోండా కార్ల ధరలు | Honda to hike vehicle prices by up to Rs 25,000 from January  | Sakshi
Sakshi News home page

పెరగనున్న హోండా కార్ల ధరలు

Dec 6 2017 8:04 PM | Updated on Dec 6 2017 8:04 PM

Honda to hike vehicle prices by up to Rs 25,000 from January  - Sakshi

న్యూఢిల్లీ : ఇయర్‌-ఎండ్‌ అమ్మకాల్లో భాగంగా వాహన కంపెనీలన్నీ భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తుంటే.. దానికి భిన్నంగా హోండా కార్స్‌ ఇండియా తన మోడల్స్‌పై ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. 2018 జనవరి 1 నుంచి హోండా కారు మోడల్స్‌పై రూ.25వేల వరకు ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. ఇన్‌పుట్‌ వ్యయాలు పెరగడంతో, మోడల్స్‌పై ధరలను పెంచుతున్నట్టు పేర్కొంది. ''జనవరి నుంచి తమ అన్ని మోడల్స్‌పై 1 శాతం నుంచి 2 శాతం వరకు ధరలు పెంచాలని మేము ప్లాన్‌ చేస్తున్నాం'' అని హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ అధికార ప్రతినిధి ప్రకటించారు.

బేస్‌ మెటల్స్‌ వ్యయాలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. హోండా కార్స్‌ రూ.4.66 లక్షల నుంచి హ్యాచ్‌బ్యాక్‌ బ్రియోను విక్రయిస్తుండగా.. అకార్డ్‌ హైబ్రిడ్‌ను రూ.43.21 లక్షలకు విక్రయిస్తోంది. అడ్వెంచర్‌ యుటిలిటీ వెహికిల్‌ వీ క్రాస్‌ మోడల్‌ రూ.13.31 లక్షలుగా ఉంది.. గత నెలలో స్కోడా ఆటో ఇండియా కూడా జనవరి 1 నుంచి తన వాహనాలపై 2 శాతం నుంచి 3 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement